భారత మిస్సైల్ దాడి నుండి ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు
భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్షిపణి దాడి నుండి పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించిన తర్వాత, ఆటగాళ్లను చార్టర్ విమానంలో దుబాయ్‌కు తరలించారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు జరగడానికి కొద్దిసేపటి ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు నూర్ ఖాన్ వైమానిక స్థావరం నుండి బయలుదేరారు. ఈ దాడికి ముందు ఆటగాళ్లే బయలుదేరడంతో ప్రమాదం తప్పింది. ఆస్ట్రేలియా నివేదికల ప్రకారం, సీన్ అబాట్, బెన్ ద్వార్షుయిస్, ఆష్టన్ టర్నర్, మిచ్ ఓవెన్ వంటి క్రికెటర్లు ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు వెల్లడైంది.
మే 10, శనివారం ఉదయం, పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం నుండి విదేశీ ఆటగాళ్ళు తమ చార్టర్ విమానంలో బయలుదేరిన కొద్దిసేపటికే, భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులు ప్రారంభించింది. ఈ దాడి ముందు క్రికెటర్లు బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇతరత్రా, భారత్ పాక్ విమానాలను "కవచంగా" ఉపయోగించుకున్నట్లు ఆరోపించింది, వాస్తవానికి పాక్ విమానాలు సరిహద్దు కాల్పుల మధ్య ప్రయాణిస్తున్నాయని పేర్కొంది.