విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై

14 ఏళ్ల ప్రస్థానం ముగిసిన కోహ్లీ.. అభిమానులకు షాకింగ్ న్యూస్

విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్ శర్మ బాటలోనే కోహ్లీ కూడా తన టెస్టు ప్రయాణానికి తెరదించారు. సోమవారం సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి ఈ విష‌యాన్ని అభిమానులతో పంచుకున్నారు. భారత్ తరఫున 14 ఏళ్లపాటు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానని కోహ్లీ భావోద్వేగంగా పేర్కొన్నారు.

2011లో వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ.. 123 టెస్టుల్లో పాల్గొని 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 శతకాలు, 31 అర్థశతకాలు ఉన్నాయి. కెప్టెన్‌గా భారత జట్టును అనేక విజయాలు అందించిన కోహ్లీ.. టెస్టు క్రికెట్‌కు ఇచ్చిన సేవలు గుర్తుండిపోతాయని అభిమానులు భావిస్తున్నారు.

ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ టీ20 ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో ఈ జంట బాట్స్‌మెన్లు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం సెలెక్టర్లకు కష్టాన్ని తెచ్చిపెడుతోంది. కొత్తతరం క్రికెటర్లను ఎంచుకోవడం, జట్టును పునర్నిర్మించటం పెద్ద సవాలుగా మారింది.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని