ఓ శకం ముగిసింది… విరాట్ రిటైర్‌పై బీసీసీఐకి ఫ్యాన్స్ ఆగ్రహం

విరాట్‌తో పాటు రోహిత్‌కీ గౌరవవంతమైన వీడ్కోలు ఇవ్వాల్సిందని అభిప్రాయం

ఓ శకం ముగిసింది… విరాట్ రిటైర్‌పై బీసీసీఐకి ఫ్యాన్స్ ఆగ్రహం

ముంబై: భారత క్రికెట్ చరిత్రలో మరో శకం ముగిసింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కొద్దిరోజుల క్రితమే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా కోహ్లీ కూడా వైట్ జెర్సీని విడిచి పెట్టాడు. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు పెద్ద సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో కోహ్లీ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయగా.. ఫ్యాన్స్ మాత్రం బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ రిటైర్మెంట్‌కు గౌరవం దక్కలేదని, బలవంతంగా రిటైర్ అయ్యేలా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనపై బీసీసీఐ స్పందిస్తూ.. ‘‘టెస్టు క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. కానీ వారసత్వం కొనసాగుతుంది. జట్టుకు విరాట్ అందించిన సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయి’’ అని వెల్లడించింది.

అయితే ఓ దిగ్గజ క్రికెటర్‌కు ఇదే గౌరవవంతమైన వీడ్కోలా? అంటూ ఫ్యాన్స్ బీసీసీఐపై మండిపడుతున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలను ప్రశ్నించకుండా, ఆటగాళ్లపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ‘‘విరాట్, రోహిత్ ఇద్దరికీ ఘనంగా వీడ్కోలు ఇవ్వాల్సింది’’ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

About The Author

Related Posts

Latest News

సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...
వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు
బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు
ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం
'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి