సద్గురు సాయినాధునికి లక్ష మల్లెల అర్చన
తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) : వైశాఖ పౌర్ణమి ప్రాధాన్యతా క్రమంలో షిరిడి సాయిబాబా వారికి భక్తజన సందోహం నడుమ విశేషంగా లక్ష మల్లెల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణాపదంలో తొలి సాయి మందిరంగా పరిడవిల్లుతున్న, బోస్ రోడ్ లోని సాయి మందిరంలో బాబా వారికి సోమవారం ప్రత్యేక పూజలు అనంతరం లక్ష మల్లెల సేవ కన్నుల పండుగ నిర్వహించారు. విశేషంగా మహిళ భక్తులు లక్ష మల్లెల అర్చన సేవలో తరించారు. కార్యక్రమం ప్రాధాన్యతను మందిర అర్చక స్వామి మీడియాకు వివరించారు. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న సాయి మందిరంలో, నిర్వహించిన లక్ష మల్లెల అర్చన పూజలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను మందిర ట్రస్టు అధ్యక్షులు నన్నపనేని బాల దుర్గాప్రసాద్, కార్యదర్శి పరుచూరి కృష్ణ కుమార్ తదితర సభ్యులు పర్యవేక్షించగా, చంద్రమౌళి ఘనాపాటి వారి శిష్యబృందం పది ఆవృతములుగా నిర్వహించినేపధ్యంలొలక్ష మల్లెల అర్చన ప్రాధాన్యతను సంతరించుకుంది.