సద్గురు సాయినాధునికి లక్ష మల్లెల అర్చన

సద్గురు సాయినాధునికి లక్ష మల్లెల అర్చన

తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) :  వైశాఖ పౌర్ణమి ప్రాధాన్యతా క్రమంలో షిరిడి సాయిబాబా వారికి భక్తజన సందోహం నడుమ  విశేషంగా లక్ష మల్లెల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణాపదంలో తొలి సాయి మందిరంగా పరిడవిల్లుతున్న, బోస్ రోడ్ లోని సాయి మందిరంలో బాబా వారికి సోమవారం ప్రత్యేక పూజలు అనంతరం లక్ష మల్లెల సేవ కన్నుల పండుగ నిర్వహించారు. విశేషంగా మహిళ భక్తులు లక్ష మల్లెల అర్చన సేవలో తరించారు. కార్యక్రమం ప్రాధాన్యతను మందిర అర్చక స్వామి మీడియాకు వివరించారు. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న సాయి మందిరంలో, నిర్వహించిన లక్ష మల్లెల అర్చన పూజలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను మందిర ట్రస్టు అధ్యక్షులు నన్నపనేని బాల దుర్గాప్రసాద్, కార్యదర్శి పరుచూరి కృష్ణ కుమార్ తదితర సభ్యులు పర్యవేక్షించగా, చంద్రమౌళి ఘనాపాటి వారి శిష్యబృందం పది ఆవృతములుగా నిర్వహించినేపధ్యంలొలక్ష మల్లెల అర్చన ప్రాధాన్యతను సంతరించుకుంది.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని