వేసవిలొ డొంకరోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

వేసవిలొ డొంకరోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్


తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) మండల అభివృద్ధిలో సరికొత్త మార్పులు తీసుకువస్తామని ఈ వేసవిలో డొంక రోడ్ల నిర్మాణాలను పూర్తిచేస్తామని  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని గంగానమ్మ తల్లి వేపచెట్టు వద్ద, సోమవారం నిర్వహించిన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్  ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేశారు. గతప్రభుత్వంలొ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ ఒకటికి పది సార్లు తిరిగినా, పరిష్కారం కాని సమస్యలు, మంత్రి మనోహర్ నిర్వహించిన, గ్రీవెన్స్ లొ,పరిష్కారానికి నోచుకోవడం పట్ల అర్జీదారులు ఆనందం వ్యక్తం చేశారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక  రైతుల ప్రయోజనాలకు తగు ప్రాధాన్యత కల్పిస్తోందని అన్నారు. మండలంలోని డొంక రోడ్ల నిర్మాణ పనులు ఈ వేసవిలో పూర్తి చేస్తామన్నారు. పది కోట్ల రూపాయల నిధులతో మండల అభివృద్ధికి ప్రాణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వనివేశన స్థలాల్లో గృహ నిర్మాణాలు, లబ్ధిదారుల నిర్మించుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండల కేంద్రమైన కొల్లిపరలొ సెంట్రల్ లైటింగ్, రోడ్ల నిర్మాణం అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన సకాలంలో అందిస్తున్న సేవలకు నిదర్శనమే, ఖరీఫ్ లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో నగదు చెల్లించడం అన్నారు. ఖరీఫ్ లొ రాష్ట్రవ్యాప్తంగా 12 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు. ఇటువంటి విధానం ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదని, కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోనె సాధ్యమైందన్నారు. జాయింట్ కలెక్టర్ భార్గవతేజ మాట్లాడుతూ పాలనాపరమైన అంశాలతొపాటు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం,అధికారులను, భాగస్వామ్యం చేయడంతొ, ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కరించే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, సర్పంచ్ పిల్లి రాధిక, ఎంపీపీ భీమవరపు పద్మావతి, ఎంపీడీవో విజయలక్ష్మి, కొల్లిపర తహసిల్దార్ సిద్ధార్థ, డీఎస్పీ బీ జనార్దన్ రావు, ఎలక్ట్రికల్ ఈ చిరంజీవి, ఏ డి ఏ ఉషారాణి, ఓ ఎస్ డి ఎస్ రత్నం, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని