డబుల్ ధమాకా: మహేష్ బాబు ‘అతడు’ 4K ట్రైలర్ విడుదల – హరిహర వీరమల్లు మూవీ ఇంటర్వెల్‌లో ప్రత్యేక ప్రదర్శన!

డబుల్ ధమాకా: మహేష్ బాబు ‘అతడు’ 4K ట్రైలర్ విడుదల – హరిహర వీరమల్లు మూవీ ఇంటర్వెల్‌లో ప్రత్యేక ప్రదర్శన!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు (ఆగస్టు 9) సమీపిస్తున్న వేళ అభిమానుల్లో సందడి మొదలైంది. ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా మహేష్ బర్త్‌డేను అభిమానులు ఘనంగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై రెండు పెద్ద అప్‌డేట్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్‌కు నిజంగా డబుల్ ధమాకా అందబోతోంది.

‘అతడు’ 4K ట్రైలర్ విడుదల – థియేటర్లలోనే ప్రత్యేక అనుభూతి

మహేష్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘అతడు’ సినిమా ఇప్పుడు 4K రీస్టోరేషన్‌తో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా 4K ట్రైలర్‌ను జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు చిత్రం ఇంటర్వెల్ సమయంలో థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. దీనితో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులకు థియేటర్‌లోనే పండగ వాతావరణం ఏర్పడనుంది.

బర్త్‌డే స్పెషల్: రాజమౌళి గ్లింప్స్ రెడీ

ఇక మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా మరో భారీ అప్‌డేట్ కూడా సిద్ధమవుతోంది. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది విడుదలైతే, ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు.

ఈ సినిమాకు ఇప్పటికే రెండు షెడ్యూల్లు పూర్తయ్యాయి. త్వరలో కెన్యా షెడ్యూల్ జరగనుండగా, ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తదితరులు పాల్గొననున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌తో మహేష్ బాబు ఇండియన్ సూపర్‌స్టార్ నుంచి ఇంటర్నేషనల్ ఐకాన్‌గా మారుతాడనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి.

మైత్రీ మూవీస్ నుంచి మరో అప్‌డేట్?

మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మైత్రీ మూవీ మేకర్స్తో పాటు ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా త‌మ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ ఇవ్వబోతున్నాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ఇది వన్-స్టాప్ సెలబ్రేషన్‌గా మారబోతోంది.

గుంటూరు కారం తరువాత…

గతంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఇప్పుడు అభిమానులంతా పూర్తి ఆశలు రాజమౌళి ప్రాజెక్ట్ పైనే పెట్టుకున్నారు.

About The Author

Related Posts

Latest News

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ.ఎస్. సుదర్శన్ రెడ్డి పై స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించారు....
బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు
భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు
కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్
నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం