తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి

తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి

హైదరాబాద్‌: వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారానికి పని గంటలు 48 గంటల పరిమితిని మించకూడదని స్పష్టం చేసింది.

పని గంటలు పెరిగినపుడు అదనంగా ఓవర్‌టైం (ఓటీ) వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టంగా పేర్కొంది. అలాగే ఉద్యోగులు రోజుకు 6 గంటల పని అనంతరం కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని, విశ్రాంతి సమయాన్ని కలిపి రోజుకు 12 గంటల కంటే ఎక్కువగా పని చేయించకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ నిర్ణయం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్నదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త మార్గదర్శకాలతో ఉద్యోగుల హక్కులను కాపాడుతూ, వ్యాపార రంగానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని పేర్కొంది.

About The Author

Related Posts

Latest News

 చైల్డ్ కేర్ లీవ్‌పై వయోపరిమితి తొలగింపు – ఎన్జీజీఓ మహిళా ఉద్యోగుల కృతజ్ఞతలు  చైల్డ్ కేర్ లీవ్‌పై వయోపరిమితి తొలగింపు – ఎన్జీజీఓ మహిళా ఉద్యోగుల కృతజ్ఞతలు
విజయవాడ(జర్నలిస్ట్ ఫైల్)  మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్‌పై ఉన్న వయోపరిమితిని పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, గుంటూరు జిల్లా మహిళా...
మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేత
చైల్డ్ కేర్ లీవ్ సడలింపుపై ఏపీ జేఏసీ అమరావతి హర్షం
గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలి.
చైల్డ్ కేర్ లీవ్‌పై వయస్సు పరిమితి తొలగింపు అభినందనీయం :ఎన్‌జీజీఓ
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కొత్త విధానం 
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి