నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా

నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా

కాఠ్‌మాండూ: నేపాల్‌లో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియా నిషేధంతో ప్రారంభమైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ పరిణామాల మధ్య నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నారని సమాచారం. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా అల్లర్లు ఆగకపోవడం గమనార్హం.

అవినీతి నిర్మూలన కోసం విద్యార్థులు, యువత భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చారు. కాఠ్‌మాండూ సహా అనేక జిల్లాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిపారు. ఆందోళనకారులను అణిచివేసేందుకు భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘర్షణల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటికే పలువురు మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి లేఖక్ తన పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా ప్రధాని ఒలీ రాజీనామాతో నేపాల్ పగ్గాలు తాత్కాలికంగా సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

About The Author

Related Posts

Latest News

సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...
వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు
బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు
ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం
'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి