ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు?

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు?

అనంతపురం (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఫ్యాప్టో కో-చైర్మన్, రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్ జి. హృదయ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 16 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలు దాటుతున్నా అప్పట్లో ఇచ్చిన హామీలు ఎక్కువగా నెరవేరలేదని ఆయన విమర్శించారు.

పాలకులు ఇచ్చిన తీయని మాటలు ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగును నింపడం లేదని, పండుగ రోజుల్లో కూడా ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయోజనాలు అందడం లేదని ఆయన అన్నారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం సాధించాలంటే ఉద్యమమే మార్గమని పేర్కొన్నారు. అక్టోబర్ 7న విజయవాడలో జరగబోయే రాష్ట్ర ఫ్యాప్టో ధర్నాను భారీ విజయవంతం చేయాలని ఉపాధ్యాయులందరూ హాజరై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతపురం జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జిల్లా చైర్మన్ ఆర్. శ్రీనివాస నాయక్ అధ్యక్షతన, సెక్రటరీ జనరల్ పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగింది

About The Author

Latest News