పదోన్నతుల జీఓ విడుదలలో జాప్యం… 23 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

పదోన్నతుల జీఓ విడుదలలో జాప్యం… 23 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

-ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీపీటీడి (ఆర్టీసీ) ఉద్యోగుల పదోన్నతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 28నే అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రభుత్వంలో కొంతమంది ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా జీఓ వెలువడడంలో జాప్యం జరుగుతోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోలు, నాలుగు వర్క్‌షాపుల వద్ద ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.

యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ విలీనం అనంతరం గత ఆరు సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో వేలాది మంది ఉద్యోగులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, ఇప్పటికీ జీఓ వెలువడకపోవడంతో ఇప్పటికే సుమారు 2000 మంది ఉద్యోగులు పదోన్నతి కోసం ఎదురుచూస్తూనే రిటైర్ అయ్యి ఆర్థికంగా నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ సిబ్బందికి విలీనానికి ముందున్న పాత విధానంలోనే పనిష్‌మెంట్లపై సడలింపులు ఇవ్వాలనే యూనియన్ విజ్ఞప్తి మేరకు గౌరవ ఆర్టీసీ వీసీ & ఎండీ ద్వారక తిరుమలరావు ప్రభుత్వం‌కు సిఫారసు చేశారని, టీఆర్అండ్‌బీ అధికారులు, రవాణా మంత్రి ఆమోదించి, చివరకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, జీఏడీలో కొందరు అధికారులు అవలంబిస్తున్న వైఖరి వల్ల అసిస్టెంట్ మెకానిక్ నుండి సూపరింటెండెంట్ కేటగిరీ వరకు అర్హత గల సుమారు 6000 మంది ఉద్యోగుల పదోన్నతులు నిలిచిపోయాయని తెలిపారు.

ఈ అన్యాయంపై నిరసనగా ఈ నెల 23 నుండి దశలవారీగా ఆందోళనా కార్యక్రమాలు ప్రారంభించాల్సి వస్తోందని పలిశెట్టి దామోదరరావు, జి.వి. నరసయ్య స్పష్టం చేశారు.

 

About The Author

Latest News

ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ? ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల...
ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ 
ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?
పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం
థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు
కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం