12పిఆర్సి కమిషన్ నియమించి 30% ఐ ఆర్ ప్రకటించాచాలి : పిఎస్టియు డిమాండ్

12పిఆర్సి కమిషన్ నియమించి 30% ఐ ఆర్ ప్రకటించాచాలి : పిఎస్టియు డిమాండ్

కడప (జర్నలిస్ట్ ఫైల్) :  కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 12వ పిఆర్సి మరియు ఐ ఆర్ ఇస్తామని ప్రకటించి  ఉద్యోగులను ఉపాధ్యాయులను మరియు పెన్షనర్లకు ఇవ్వకపోవడం దగా చేయడమే  అని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 12పిఆర్సి కమిషన్ నియమించి 30% ఐ ఆర్ ప్రకటించాల్సిందే అని  మాజీ ఎమ్మెల్సీ పోచం రెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధమ కార్యవర్గ సమావేశం  కడప శాంతినికేతన్ స్కూల్లో జిల్లా అధ్యక్షులు పీవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగినది. 

ఈ సందర్భంగా ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 2026వ సంవత్సరపు డైరీని మరియు స్టికర్ కాలెండర్ ని  మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి సుబ్బారెడ్డి , రాష్ట్ర అధ్యక్షులు లెక్కల జమాల్ రెడ్డి , రాష్ట్ర గౌరవాధ్యక్షులు పిసి రెడ్డన్న, ,  ఉపాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి రామాంజనేయరెడ్డి , రాష్ట్ర కార్యదర్శి ఎస్ ముని రెడ్డి , జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు పివి సుబ్బారెడ్డి గాజుల నారాయణరెడ్డి తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లెక్కల జమాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల సిపిఎస్ విధానాన్ని సమీక్షించి దాని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొని వస్తామని హామీ ఇచ్చి  ప్రభుత్వం 18 నెలల కాలం గడిచిన తర్వాత అయినా సిపిఎస్ పై సమీక్ష చేయకుండా కాలయాపన చేస్తుందని ఇప్పటికైనా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు 

అంతేకాక నెల నెలా ఒకటో తారీకు జీతాలు చెల్లిస్తామని చెప్పి పదవ తారీకు వచ్చినా చెల్లించక పోవడం ఉద్యోగులను ఇబ్బందులు గురి చేయడమే అని ఇప్పటికైనా సకాలంలో జీతాలు అందించాలని డిమాండ్ చేశారు . అలాగే పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్ గత 18 నెలల కాలంగా చెల్లించకపోవడం దురదృష్టం అని     వెంటనే చెల్లించాలని అన్నారు.

రాష్ట్ర గౌరవాధ్యక్షులు పిసి రెడ్డన్న మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులకు,  ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు 31 వేల కోట్ల బకాయిలను దశలవారుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గాజులపల్లి నారాయణరెడ్డి మాట్లాడుతూ డి ఎ అరియర్స్ వెంటనే జిపిఎఫ్ ఖాతాలకు  చెల్లించాలి. అలాగే పెన్షనర్లకు మరియు సిపిఎస్ ఉద్యోగులకు నగదుగా వెంటనే చెల్లించాలి. 

 రాష్ట్ర ఉపాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలనీ, విద్యార్థులను ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురి చేయవద్దు అని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ,విద్యా సంస్కరణలు చేసేటప్పుడు మేధావులను, ఉపాధ్యాయ సంఘాలను ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని చేయాలనీ అన్నారు .రాష్ట్ర కార్యదర్శి ఎస్ ముని రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి యాక్షన్ ప్లాన్ విద్యార్థులకు నష్టపరిచే విధంగా ఉంది. ఉపాధ్యాయ సంఘాల, సైకాలజీ ప్రొఫెసర్ల మరియు ఉపాధ్యాయుల అభిప్రాయం తీసుకుని పని దినాల్లోనే ఉండాలనీ అన్నారు
 
వైయస్సార్ కడప జిల్లా అధ్యక్షులు పీవీ సుబ్బారెడ్డి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు "టెట్" లేకుండా చేయాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి పార్లమెంటులో చట్టం చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.  పెన్షనర్లకు గతంలో మాదిరిగానే క్వాంటం పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.  జిల్లా సిపిఎస్ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కమిటీ రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పూనుకోవాలని అందులో పి ఎస్ టి యు ముందుండి పోరాటాలకు సిద్ధమని అన్నారు కార్యక్రమంలో మైనారిటీ కన్వీనర్ లియాకత్ ఆర్థిక కార్యదర్శి జి హరినారాయణ దిలీప్ కుమార్ , లెక్కల శ్రీనివాస్ రెడ్డి,  పిఎస్టియు బాధ్యులు బాలిరెడ్డి, చెన్నయ్య సుధాకర్ రెడ్డి రామలక్ష్మి రెడ్డి   రామ్మోహన్,  దిలీప్ కుమార్ రెడ్డి,  నారాయణరెడ్డి, జిల్లా బాధ్యులు , మండల  బాధ్యులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

'ఏపీ ఎన్‌జీజీవో' అవిర‌ళ కృషితోనే నేడు ఉద్యోగులకు అనేక సౌక‌ర్యాలు 'ఏపీ ఎన్‌జీజీవో' అవిర‌ళ కృషితోనే నేడు ఉద్యోగులకు అనేక సౌక‌ర్యాలు
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేయం ఉద్యోగుల సంక్షేమం వైపు మా అడుగులు వేస్తాం ఏపీ ఎన్‌జీజీవో న‌గ‌ర కార్య‌వ‌ర్గం ఏక‌గ్రీవ ఎన్నిక‌ భారీగా త‌ర‌లివ‌చ్చిన ఉద్యోగులు...
*సైబర్ నేరాల కట్టడికి సాంకేతిక నైపుణ్యం, ప్రజా అవగాహనే ఆయుధాలు
తరుచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి
*ఉపాధి కల్పనలో ఏపీ-కేవీఐబీ సేవలు భేష్*
వాలిడేషన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి: అఖిల భారత స్టేట్ పెన్షనర్ల సమాఖ్య
విజిలెన్స్ & సెక్యూరిటీ స్టాఫ్ సమస్యలపై చర్చ
12పిఆర్సి కమిషన్ నియమించి 30% ఐ ఆర్ ప్రకటించాచాలి : పిఎస్టియు డిమాండ్