పల్నాడు రోడ్డు ప్రమాద దుర్ఘటన కలచివేసింది: మంత్రి లోకేష్ తీవ్ర విచారం
On
పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
About The Author
Related Posts
Latest News
05 Jul 2025 21:24:41
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి...