ఆదంపుర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
పాక్ దుష్ప్రచారానికి ఘాటుగా సమాధానం
On
దేశంలో రెండో అతిపెద్దదైన పంజాబ్‌లోని ఆదంపుర్ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. ఉదయం ఈ స్థావరానికి చేరుకున్న ఆయన వాయుసేన అధికారులతో ముచ్చటించారు. వారి శ్రమను ప్రశంసిస్తూ భుజం తట్టి అభినందించారు.
ఈ సందర్భంగా వాయుసేన సిబ్బంది ఆపరేషన్ సిందూర్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. దాదాపు గంటన్నరకు పైగా స్థావరంలో గడిపిన మోదీ, త్రిశూల్ చిత్రం ఉన్న ప్రత్యేక టోపీ ధరించి ఆకట్టుకున్నారు.
ఇక ఇటీవల ఆదంపుర్ స్థావరంపై దాడి జరిగినట్లు పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది. దీనికి గట్టి సమాధానంగా స్వయంగా స్థావరానికి చేరుకుని అక్కడ పరిస్థితులు సమీక్షించారు ప్రధాని. పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సందేశమిచ్చారు.
About The Author
Latest News
16 May 2025 19:32:02
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు (...