2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీల ఆడటం అనుమానమే: సునీల్ గవాస్కర్

2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీల ఆడటం అనుమానమే: సునీల్ గవాస్కర్

2027 వన్డే వరల్డ్ కప్‌ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల క్రికెట్ ప్రయాణం కొనసాగుతుందా అనే విషయంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన గవాస్కర్ – "ఆ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్ 2027లో పాల్గొంటారా అన్నది డౌట్‌గానే ఉంది" అని పేర్కొన్నారు.

ఇటీవలే రోహిత్, కోహ్లీలు టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో, వారి వన్డే భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ స్పందిస్తూ, “వాళ్లు వన్డేల్లో ఆడతారా అనేది సెలెక్షన్ కమిటీపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాళ్లు అప్పటికి ఫిట్‌గా ఉండి సెంచరీల మీద సెంచరీలు చేస్తుంటే, అప్పుడు వారిని ఆపడం దేవుడికి కూడా సాధ్యం కాదు” అని హృదయపూర్వకంగా అన్నారు.

విరాట్ టెస్టుల నుంచి తప్పుకోవడంపై గవాస్కర్ అసహమతి వ్యక్తం చేయలేదు. “వాళ్లు సెలెక్టర్లతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇది వారి స్వీయ నిర్ణయం కావడం మంచి పరిణామం” అని వివరించారు.

అలాగే బుమ్రాను టెస్టు కెప్టెన్‌గా నియమించడాన్ని గవాస్కర్ సమర్థించారు. “ఇంకెవ్వరినైనా కెప్టెన్ చేస్తే బుమ్రాపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. వికెట్ల కోసం ఎక్కువ ఓవర్లు వేయాల్సి వస్తుంది. కానీ అతడే కెప్టెన్ అయితే, అవసరమైన సమయంలో విశ్రాంతి తీసుకునే స్వేచ్ఛ అతనికి ఉంటుంది” అని గవాస్కర్ వివరించారు.

 

About The Author

Related Posts

Latest News

 చైల్డ్ కేర్ లీవ్‌పై వయోపరిమితి తొలగింపు – ఎన్జీజీఓ మహిళా ఉద్యోగుల కృతజ్ఞతలు  చైల్డ్ కేర్ లీవ్‌పై వయోపరిమితి తొలగింపు – ఎన్జీజీఓ మహిళా ఉద్యోగుల కృతజ్ఞతలు
విజయవాడ(జర్నలిస్ట్ ఫైల్)  మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్‌పై ఉన్న వయోపరిమితిని పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, గుంటూరు జిల్లా మహిళా...
మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేత
చైల్డ్ కేర్ లీవ్ సడలింపుపై ఏపీ జేఏసీ అమరావతి హర్షం
గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలి.
చైల్డ్ కేర్ లీవ్‌పై వయస్సు పరిమితి తొలగింపు అభినందనీయం :ఎన్‌జీజీఓ
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కొత్త విధానం 
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి