రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : అనారోగ్యం కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురి కాకూడదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఐపీడీ కాలనీకి చెందిన కారంశెట్టి ఆశాజ్యోతి కిడ్నీలు దెబ్బతినడంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు. వైద్యం కోసం అప్పులు చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ను సంప్రదించగా వెంటనే ఆయన స్పందించారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు అవసరమైన దరఖాస్తులు తెప్పించారు. తమ కార్యాలయం నుంచి దరఖాస్తు చేయించి ఎప్పకప్పుడు ఫాలో అప్ చేశారు. దీంతో ఆశాజ్యోతికి రూ.6,52.807 చెక్కు మంజూరైంది. దీంతో గురువారం బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి చెక్కును ఎమ్మెల్యే నసీర్ అందించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నసీర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామని, బాధితులకు అండగా నిలవడం మా బాధ్యతగా భావిస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు.