నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం

జోరు వర్షాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా నగర పాలక సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ సూచనలతో ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో శుక్రవారం కమిషనర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ గారు అరండల్‌పేట, అమరావతి రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్, మారుతీనగర్, కంకరగుంట ఆర్యుబి ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

కమిషనర్ ఆదేశాలు:

  • గత రాత్రి కురిసిన వర్షానికి విరిగిన చెట్లను, హోర్డింగ్స్‌ను తక్షణమే తొలగించాలి.

  • నీరు నిలిచిన ప్రాంతాల్లో బైలవుట్ పనులను వేగంగా చేపట్టాలి.

  • 3 వంతెనల వద్ద నిలిచిన సిల్ట్‌ను జెట్టింగ్ మెషిన్ల ద్వారా శుభ్రం చేయాలి.

  • కంకరగుంట ఆర్యుబి వద్ద అదనపు మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తొలగించాలి.

  • విరిగిన చెట్లు తొలగింపునకు ఉద్యానవన సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి.

  • త్రాగునీటి సరఫరా అంతరాయం రాకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలి.

  • మెయిన్ డ్రైన్లలోకి కలిసే చిన్న డ్రైన్ల వద్ద ఏర్పాటైన మెష్‌లకు సమయానికి వ్యర్థాలు తొలగించేలా పర్యవేక్షణ చేపట్టాలి.

  • నగరంలోని హోర్డింగ్స్, బ్యానర్లను తక్షణమే తొలగించాలని ఆదేశం.

  • పాత భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలి, కొత్త నిర్మాణాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ప్రజలకు సూచనలు:

వర్షం, నీటి నిలిచే సమస్యలు, చెట్లు విరిగి ట్రాఫిక్‌కు ఆటంకాలు, త్రాగునీటి సమస్యలు ఏర్పడిన సందర్భాల్లో జిఎంసి కాల్ సెంటర్ నెంబర్లకు – 08632345103, 104, 105 – కాల్ చేయాలని సూచించారు. స్పందన త్వరితంగా ఉంటుందని చెప్పారు.

ఈ పర్యటనలో సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ మధుసూధన్, టిపిఎస్‌లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

 

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని