గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది

ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది

 

- బియ్యం దొంగతనం చేసిన ఒక వ్యక్తితో జగన్ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు
- వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను హింసించారు
- గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకుల వేధింపులకు భయపడి ఊర్లు ఖాళీ చేశారు
- త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు పథకం అమలు

అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు రాష్ట్రంలో అసత్యపు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంద, అరాచకాలు, విధ్వంసాలు, కక్షసాధింపులతో ప్రజలను పీడించుకుతిన్నారు.  గుంటూరు జిల్లాలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున దాడులు చేయించి, టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించారు. దీనివల్ల అనేక మంది గ్రామాలు వదిలి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గతంలో టీడీపీ నాయకులపైన అచ్చెన్నాయుడు దగ్గర నుంచి నామీద, మా నాయకుడు చంద్రబాబునాయుడుగారిని కూడా కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా?"  పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది వైసీపీయేనని, జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో గ్రామాల్లో కత్తులు తిప్పి అరాచకాలు చేసింది వైసీపీ నాయకులే. నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ నాయకుడు సర్పంచ్‌గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి, గ్రామాల్లో వ్యక్తిగత దాడులకు దిగి అక్రమ కేసులు పెట్టాడని, బాబూరావుపై దాడి చేస్తే దాదాపు నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలి వెళ్లిపోయిన వారు, ఇప్పుడు మళ్లీ వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత కక్షలకు పార్టీ రంగులు పులుముతున్నారు. విజయవాడలో చెన్నుపాటి గాంధీ కన్ను పొగొట్టింది వైసీపీ ప్రభుత్వమే. దళిత సీఐ ఆనందరావును బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడంతో అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ నాయకుడు పెద్దారెడ్డి చెప్పిన పనులు చేయలేదని గుర్రయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, అలాగే పేదవాడైన అమర్‌నాథ్ ‌ను పెట్రోల్ పోసి తగలబెట్టింది వైసీపీ ప్రభుత్వమే. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి దాదాపు 80 మంది తెలుగుదేశం నాయకులను పెట్టనపెట్టుకుంది వైసీపీ దుర్మార్గమైన ప్రభుత్వమే.


 జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక దళిత బిడ్డపై అత్యాచారం జరిగినా పట్టించుకోలేదని, దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగించారని, పోలీస్ స్టేషన్లలో కేకులు కట్ చేయించారు. ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ‌ను హింసించి, వేధించి అతని ప్రాణాలు పోవడానికి కారణం వైసీపీయే. ఇసుక దందాను ప్రశ్నిస్తే దాడులు చేసి శిరోముండనం చేసింది కూడా వైసీపీనే కదా. మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిపింది వైసీపీయేనని, పులివెందులలో అత్యాచారం చేసి హత్య చేస్తే, పరామర్శకు అనిత  వెళ్తే ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా?. అలాగే తెలుగుదేశం కార్యాలయంపై దాడులు చేయించి, దాడులు చేసిన వారికి ప్రమోషన్లు ఇప్పించారు. చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు.

కక్షపూరితమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి... తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎవరైతే దాడులు చేశారో వారికి ప్రమోషన్లు ఇచ్చి క్రిమనల్స్ ను ప్రోత్సహించింది వైసీపీయే. బూతులు మాట్లాడిన వారికి రక్షణ కల్పించారు. పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఒక జీవో తెచ్చింది కూడా వైసీపీయే. బియ్యం కొట్టేసినవాడు మాట్లాడుతున్నాడు.. దొంగపట్టాలు ఇచ్చినోడు మాట్లాడుతున్నాడు.. ప్రజాస్వామ్యంలో ఇంత నీచానికి దిగజారుతారా.. సిగ్గులేకుండా బరితెగించి మాట్లాడుతారా?. వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారులను వేధించారని, అనేకమంది ఐఏఎస్ అధికారులు జైలుపాలయ్యారు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు, కథనాలు, ప్రెస్‌ మీట్లు పెట్టించారు. దోపిడీ దొంగలు వచ్చి ప్రెస్ ‌మీట్లు పెడుతుంటే బాధ అనిపిస్తుంది. గతంలో పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్‌లో చనిపోతే, దాన్ని మతాల మధ్య విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొంటూ, పిల్ల సైకోలు చేసిన తప్పులు తప్పించడం కోసం తప్పుడు ప్రెస్ ‌మీట్లు పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, అధికారులను వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారో ఆమె స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది

ప్రస్తుతం ఏడాది కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు,  ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, వికలాంగులకు రూ.6000, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు రూ.10,000, పూర్తిగా బెడ్ మీద ఉన్నవారికి రూ. 15000 ఇస్తున్నాం. దాదాపు 2 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇచ్చామని, గతంలో 42 లక్షల మందికి ఇస్తే, ఈరోజు 67 లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చాం. రోడ్ల గుంతలను పూడ్చి ప్రజలకు సౌకర్యవంతంగా చేశామని, గ్రామాల్లో సీసీరోడ్లు వేశామని తెలిపారు. త్వరలో అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత ఇవ్వనున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నాం. మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే.. చూసి తట్టుకోలేక.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బురదజల్లే కార్యక్రమాలకు కొంతమంది పేటిఎం బ్యాచ్‌లను పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే మీకు బుద్ది చెప్తారని హెచ్చరిస్తున్నాం. త్వరంలో మీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం.. ఫ్రస్టేషన్‌లో రోజుకో మాట మాట్లాడుతున్నారు. 

సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ రాజీనామా, సింగయ్యకు సంబంధించిన వీడియోలు వంటి విషయాలను కూడా వైసీపీ రాజకీయం చేస్తోంది. దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే.. దొర అయిపోతారా? అక్రమంగా ఇళ్ల పట్టాలు సృష్టించి ఎన్నికల్లో కొడుకును అందలం ఎక్కించడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులను మీ పక్కన కూర్చోబెట్టుకుని ప్రోత్సహిస్తారా?. తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు.

About The Author

Latest News

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి...
ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం
రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 
గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది
మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన
వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం