ఫలించిన చంద్రబాబు కృషి... రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా 

రైతాంగం తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ఫలించిన చంద్రబాబు కృషి... రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా 

రాష్ట్రానికి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు రైతులకు ఊరట ఇచ్చింది. చంద్రబాబు కృషి ఫలితం, సరఫరా సమన్వయం సరిగ్గా జరిగేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది.

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్ర రైతుల కోసం ఎరువుల సరఫరాలో మరో ఊరట. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించబడటంతో రైతులు హర్షోద్గారాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు ఈ విజయానికి కారణం చంద్రబాబు నాయుడు చేసిన విశేష కృషి అని ప్రత్యేకంగా ప్రశంసలు వ్యక్తం చేశారు.వివరాల ప్రకారం, యూరియా వినియోగం ఎక్కువగా ఉండే సెప్టెంబర్ మాసానికి అధిక మొత్తంలో ఎరువులు రాష్ట్రానికి చేరుతున్నాయి. గత ఆగస్టు నెలలో కేటాయించిన 81,000 మెట్రిక్ టన్నుల యూరియాకు అదనంగా ఈ 50,000 మెట్రిక్ టన్నులు కేటాయింపయ్యాయి. ఈ సరఫరా ద్వారా సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పంటలకు అవసరమైన ఎరువును అందుకోగలుగుతున్నారు.రాష్ట్రానికి రాబోయే యూరియా సరఫరా రెండు రోజుల్లో కాకినాడ, విశాఖ, మంగళూరు, జైగర్ పోర్ట్‌లకు చేరనుంది. అక్కడినుంచి రైల్వే గూడ్స్ రేకుల ద్వారా రైతు కేంద్రాలకు పంపిణీ చేయబడుతుంది. ఈ పునర్వ్యవస్థపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు ప్రత్యేక దిశానిర్దేశం చేశారు. ఆయన ఎరువుల సరఫరా సమయం, రైల్వే మార్గాల సమన్వయం, మరియు రాష్ట్ర రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు.వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటనలో, యూరియా సరఫరా సంక్షోభ సమయంలో రాష్ట్ర రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రత్యక్ష చర్యల్లోకి దిగి, కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా కేంద్ర ఎరువుల రసాయనిక శాఖతో ప్రత్యేక చర్చలు జరిపి రాష్ట్ర రైతుల అవసరాలను పూరించినట్టు తెలిపారు. రైతుల తరుపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వివరాల ప్రకారం, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా కాకినాడకు 17,294 మెట్రిక్ టన్నులు, ఇండియన్ పొటాష్ లిమిటెడ్ ద్వారా మంగళూరు 5,400 మెట్రిక్ టన్నులు, నర్మదా కంపెనీ ద్వారా జైగర్ 10,800 మెట్రిక్ టన్నులు, నేషనల్ ఫెర్టిలైజర్స్ ద్వారా విశాఖకు 15,874 మెట్రిక్ టన్నులు రాబోవు రెండు రోజుల్లో రాష్ట్రానికి చేరనున్నాయి. దీనితో రాష్ట్రానికి లభించే మొత్తం 50,000 మెట్రిక్ టన్నుల కేటాయింపు ఆగస్టు నెలకు కేటాయించిన 81,151 మెట్రిక్ టన్నుల అదనంగా ఉంటుంది. ఇప్పటికే 41,183 మెట్రిక్ టన్నుల యూరియా రైతుసేవ కేంద్రాలకు పంపిణీ అయి చేరింది. మిగిలిన 40,968 మెట్రిక్ టన్నులు రవాణాలో ఉన్నాయి.రైతులు ధైర్యంగా ఉండాలని, ఎటువంటి కొరత లేదని మంత్రి సూచించారు. యూరియాను శాస్త్రీయంగా, తక్షణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే వినియోగించాల్సినదని, ఎరువుల వినియోగంపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించడానికి క్షేత్ర సిబ్బంది ఔట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించాల్సిందని సూచించారు.

About The Author

Latest News

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ.ఎస్. సుదర్శన్ రెడ్డి పై స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించారు....
బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు
భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు
కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్
నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం