హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన నూతన న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రమేశ్ చేత న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు.
గతంలో జస్టిస్ రమేశ్ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి అనంతరం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మళ్లీ ఏపీ హైకోర్టుకు బదిలీ కావడంతో ఆయనకు మరోసారి న్యాయమూర్తి బాధ్యతలు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ ఐ. సాంబశివప్రసాద్, రిజిస్ట్రార్ జనరల్ వై.వై.ఎస్. బిజి. పార్ధసారధి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్. ద్వారకానాధ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పలువురు రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్ మరియు బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.