తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం!

తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం!

తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ
 
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ )  :  తెలంగాణ ( Telangana ) రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ( Rudra Rajesam )  ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సుమారు 12 నమూనాలు రూపొందించగా.. వాటిలో ఒకటి సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy )  ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులు సూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు రూపొందే చిహ్నాన్ని.. జూన్ 2న ఆవిష్కరించనున్నారు.
 
ఇక రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన 'జయ జయహే తెలంగాణ'కు ( Jaya Jayahe Telangana ) తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా రెండు నిమిషాల గీతంలో కవి అందెశ్రీ మార్పులు చేశారు. సీఎం రేవంత్, అందెశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి స్వరకల్పన చేశారు. ఈ గీతాన్ని కూడా జూన్ 2న  ఆవిష్కరించనున్నారు. మరోవైపు తెలంగాణ తల్లి రూపం ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం.

About The Author

Related Posts

Latest News

మొంథా తుపాను ముప్పు...  మొంథా తుపాను ముప్పు... 
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది — రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశంకాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తీరం దాటే సూచనలు అమరావతి  ( జర్నలిస్ట్...
 ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి
కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి