జగన్ మళ్ళీ సీఎం కావడమే అంతిమ లక్ష్యం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

జగన్ మళ్ళీ సీఎం కావడమే అంతిమ లక్ష్యం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

-అనుబంధ విభాగాల నేతలకు అప్పిరెడ్డి దిశానిర్దేశం 

గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : "ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎళ్ళవేళలా ముందుండాలి. అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి." అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నూతనంగా నియమితులైన పలు అనుబంధ విభాగాల నేతలకు దిశానిర్దేశం చేశారు. అనుక్షణం అభివృద్ధి - ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే పార్టీ అధినేత వైయస్ జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడమే అంతిమ లక్ష్యంగా పని చేయాలని కర్తవ్య బోధ చేశారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా నియమితులైన పేరుపోగు బాబు, పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుంజర ప్రభు, పార్టీ జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి బండారు రాకేష్ శనివారం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, ప్రతిదానికీ ప్రైవేటీకరణ మంత్రం జపిస్తూ.. పేదలను మరింత నిరుపేదలుగా మారుస్తూ.. కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తూ.. కుట్రలు - కుతంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న వేళ నూతనంగా పదవులు పొందిన వారు అత్యంత బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించాలన్నారు. నిత్యం కార్యకర్తలు, ప్రజలతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాల జయప్రదంలో కీలకంగా మారాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దూపాటి వంశీ, వైయస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శేషగిరి పవన్‌కుమార్, పార్టీ నేతలు మేరీ, బోరుగడ్డ రజినీకాంత్, వెంకట్, సత్యం, రవి నాయక్, మణి, టోపీ మస్తాన్, మీరావలి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News

మొంథా తుపాను ముప్పు...  మొంథా తుపాను ముప్పు... 
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది — రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశంకాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తీరం దాటే సూచనలు అమరావతి  ( జర్నలిస్ట్...
 ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి
కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి