ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు సిటీ తాలూకా యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ గుంటూరు సిటీ తాలూకా యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ శనివారంజారీ అయింది. గుంటూరు జిల్లా కార్యవర్గం ఎన్నికల అధికారిగా డి.డి. నాయక్‌ను, సహాయ ఎన్నికల అధికారిగా బి. అశోక్ కుమార్‌ను, పర్యవేక్షకుడిగా ఎస్. రాజశేఖర్‌ను నియమించింది.
జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం గుంటూరు అర్బన్, రూరల్, పెదకాకాని మండలాలను కలుపుకుని గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌కు ఎన్నికలు నిర్వహించబడనున్నాయి. ఓటర్ల నమోదు కార్యక్రమం నవంబర్ 7న సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. నామినేషన్ దాఖలు నవంబర్ 10న మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. నవంబర్ 17న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఏపీఎన్జీజీవో హోమ్‌లో ఎన్నికా ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రతిని యూనిట్ అధ్యక్షుడు ఎస్.పీ.ఎస్. సూరి, కార్యదర్శి సిహెచ్. కళ్యాణ్ కుమార్ లకు అందజేయడం జరిగింది. అలాగే నోటీస్ బోర్డులో కూడా షెడ్యూల్‌ను ప్రదర్శించారు. గుంటూరు తాలూకా పరిధిలోని ఉద్యోగులందరికీ ఎన్నికల వివరాలు తెలియజేయబడ్డాయి.

