వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

'మిస్ య చీక్స్' అంటూ గంభీర్ స్పందన

వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

ముంబై: భారత క్రికెట్ అభిమానులకు కింగ్ విరాట్ కోహ్లీ షాకింగ్ వార్త చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు సోష‌ల్ మీడియా వేదికగా కోహ్లీ ప్రకటించాడు. ఈ నిర్ణయం అభిమానులను కలచివేసింది. ఇకపై వైట్ జెర్సీలో తమ అభిమాన క్రికెటర్‌ని చూడలేమని భావించిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మాత్రం కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘‘సింహం లాంటి ప్యాషన్ కల వ్యక్తి.. మిస్ య చీక్స్’’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. కోహ్లీ రిటైర్మెంట్ వార్తపై గంభీర్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు, విదేశీ క్రికెటర్లు కూడా స్పందించారు.

కోహ్లీ 2011లో వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 123 టెస్టుల్లో పాల్గొని 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్థశతకాలు ఉన్నాయి. అతని వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ 254 పరుగులు. టెస్టు కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలను అందించిన కోహ్లీ వైట్ బాల్ క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

About The Author

Related Posts

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని