పుల్వామా దాడిపై పాక్ అంగీకారం

తమ సైన్యం వ్యూహాత్మక చర్యే అని పేర్కొన్న పీఏఎఫ్ అధికారి

పుల్వామా దాడిపై పాక్ అంగీకారం

ఇస్లామాబాద్: 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి తమ సైన్యమే కారణమని పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా పాకిస్థాన్ ‘‘ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ మాటలు మార్చుతూ వచ్చినా.. తాజాగా మాత్రం అసలు నిజాన్ని ఒప్పుకుంది.

పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన వైస్ మార్షల్ ఔరంగజీబ్ అహ్మద్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అంగీకరించారు. ఆయన ప్రస్తుతం పీఏఎఫ్‌కు పౌర సంబంధాల ప్రధాన అధికారిగా ఉన్నారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రకారం – ‘‘పుల్వామా దాడి పాకిస్థాన్ సైన్యం ప్రణాళికలో భాగం. ఇది వ్యూహాత్మక తెలివితేటల ఫలితం’’ అని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు, సైన్యం ఈ దాడిని ఖండిస్తూ వచ్చాయి. భారత్‌పై ఆరోపణలు చేస్తూ.. తమకు ఎలాంటి సంబంధం లేదని నిరాకరించాయి. ఇటీవల జరిగిన పహల్గాం దాడులపై కూడా ఇదే మాదిరి వైఖరిని చూపిన పాక్.. ఇప్పుడు మాత్రం పుల్వామా దాడి తమ వ్యూహానికి భాగమేనని బహిరంగంగా చెబుతోంది.

ఈ నేపథ్యంలో భారత అధికారి వర్గాలు స్పందిస్తూ.. ‘‘పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు ఇదే నిదర్శనం. పుల్వామా దాడికి వాళ్లే బాధ్యులని వారు స్వయంగా అంగీకరించడం చాలా కీలక పరిణామం’’ అని పేర్కొన్నాయి.

ఇకపోతే, ‘‘పాక్ భూభాగానికి, గగనతలానికి లేదా ప్రజలకు ఎలాంటి ముప్పు వచ్చినా మౌనంగా ఉండేది కాదు. ప్రజలకు సైన్యం జవాబుదారి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అంటూ ఔరంగజీబ్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, భారతపై ప్రతీకారమే పుల్వామా దాడికి కారణమన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసేలా ఉన్నాయి.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని