ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
On
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గెస్ట్ లెక్చరర్ లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ. 150 పారితోషికాన్ని రూ.375కు పెంచగా, నెలకు గరిష్టంగా రూ.27,000గా నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తాజాగా విడుదలైన జీఓ లో
తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 475 జూనియర్ కాలేజీల్లో పనిచేసే 1177 మంది గెస్ట్ లెక్చరర్లు లబ్ధి పొందనున్నారు.
Tags: AP Government minister nara lokesh IT department Teacher Welfare Education Reforms AP Government Initiatives Guest Lecturers Salary Increase Andhra Pradesh Education Junior Colleges Government Decision AP Junior Colleges G.O. Release Guest Lecturer Pay Pay Raise 475 Junior Colleges 1177 Guest Lecturers AP Higher Education Salary Revision Government Teachers Teacher Salary Increase Education Sector.
About The Author
Latest News
16 May 2025 19:32:02
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు (...