గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
విస్తరణ, భూసేకరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
భూసేకరణ సర్వే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలి
జల వనరుల శాఖ అధికారుల సమావేశంలో పెమ్మసాని
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలి. అలాగే పూసేకరణ సర్వే పనులతో పాటు త్వరితగతన పనులను ప్రారంభించాలి." అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు.
గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు తగ్గట్టుగా పనులు ప్రారంభించాలని సూచిస్తూ పెమ్మసాని తన క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమావేశమయ్యారు.
గుంటూరు, పల్నాడు ప్రాంతాలకు ఉపయోగపడేలా గుంటూరు ఛానల్ విస్తరణ అభివృద్ధి పనుల నిమిత్తం కేంద్రమంత్రి పెమ్మసాని చొరవతో 2025 - 26 బడ్జెట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ, భూసేకరణకు కలిపి రూ. 400 కోట్లను నిధులను మంజూరు చేసింది. అందులో భాగంగా భూసేకరణకు రూ. 75 కోట్లను, విస్తరణకు రూ. 96 కోట్లను నాలుగు విడతలుగా విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం ప్రకటించింది. కాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో త్వరితగతిన విస్తరణ భూసేకరణ పనులను త్వరగా ప్రారంభించాలని పెమ్మసాని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే భూసేకరణలో భాగంగా నాలుగు గ్రామాల్లో నిర్వహించాలని సర్వే పనులను కాంట్రాక్టు సంస్థ చేపట్టాలని అధికారులకు ఆయన తెలియజేశారు ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలు త్వరితగతిన పంపాలని, అభివృద్ధి పనులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని అధికారులు పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ రాంబాబు, సూపర్ ఇండియన్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.