బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): 28 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వెలగలేటి గంగాధర్‌ను రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బీజేపీ పార్టీకీ దశాబ్దాల తరబడి గంగాధర్ చేసిన సేవలను ప్రశంసిస్తూ భాజపా రాష్ట్ర పబ్లిసిటీ ,లిటరేచర్ ప్రముఖ్ పాలపాటి రవికుమార్ ఆధ్వర్యంలో బ్రాడీపేట లోని కార్యాలయంలో మంగళవారం ఘనంగా అభినందన కార్యక్రమం జరిగింది .
కార్యక్రమంలో రిటైర్డ్ ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ పాతూరి మధుసూదనరావు, రిటైర్డ్ ఎక్సైజ్ ఏఈస్ జీ. నరసింహరావు, రియల్ ఎస్టేట్ అధినేత ఓరుగంటి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ స్త్రీ శిశు సంక్షేమశాఖ సూపరింటెండ్ వేములూరి ప్రసాద లింగం, పార్టీ నాయకులు ఈమని మాధవరెడ్డి, ప్రతాప ప్రసాద్, సాయి రాధాకృష్ణ, మారుతి గౌతమ్ పాల్గొన్నారు.
పాలపాటి రవికుమార్ మాట్లాడుతూ, గంగాధర్ పార్టీ అభ్యున్నతే ధ్యేయంగా నిజాయితీగా పనిచేశారని, ఆయనకు భాజపా ఇచ్చిన గౌరవమే డైరెక్టర్ బాధ్యత అని తెలిపారు. ఆయన కార్పొరేషన్ అభివృద్ధికి, పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.గంగాధర్ మాట్లాడుతూ, తనకు ఈ పదవి రావటానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.