ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం

ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం



అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖలో పనిచేస్తున్న ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తమ అసోసియేషన్ పక్షాన కోరగా విద్యాశాఖ డైరెక్టర్ వి విజయ్ రామరాజు సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం ఒక ప్రకటనలో తెలిపారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ లేనందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. హై స్కూల్లో 10 నుండి 20 మంది టీచర్లకు హెచ్ఎం గా  పనిచేస్తున్న హెచ్ఎం లకు డ్రాయింగ్ పవర్స్ ను కల్పించిన ప్రభుత్వం
 మండలంలో 150 నుండి 200 మంది టీచర్లకు డ్రాయింగ్ ఆఫీసర్ గా, పరిపాలన అధికారిగా పనిచేస్తూ గెజిటెడ్ ఆఫీసర్స్ గా ఉన్న ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్సు కల్పించకపోవడం తమకు ఆత్మగౌరవ సమస్యగా మారిందన్నారు.
ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యాశాఖ డైరెక్టర్ కు విజ్ఞప్తి చేయగా, సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తమ అసోసియేషన్ తో మాట్లాడి తప్పనిసరిగా  తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇందుకు తమ అసోసియేషన్ తరపున డీఎస్ ఈ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని