జీవో నెం.117ను ప్రత్యామ్నంగా వచ్చిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను నాశనం చేస్తాయ్: ఆప్టా హెచ్చరిక

జీవో నెం.117ను ప్రత్యామ్నంగా వచ్చిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను నాశనం చేస్తాయ్: ఆప్టా హెచ్చరిక

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలో ఇటీవల జీవో నెం.117కు ప్రత్యామ్నంగా విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జీవోల ప్రకారం ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని 1:30గా నిర్ణయించడంతో రాష్ట్రంలోని అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోతున్నాయని ఆప్టా తెలిపింది.

ఈ పరిస్థితి కొనసాగితే పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోయి భవిష్యత్తులో అవి జీరో ఎన్రోల్మెంట్‌కు లోనై శాశ్వతంగా మూతపడే అవకాశముందని హెచ్చరించింది. ఈ అంశంపై పలుమార్లు వినతులు సమర్పించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధన కోసం సబ్జెక్టు టీచర్లుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ల సేవలను వినియోగించాలని, ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్ కల్పించి ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని ఆప్టా చేసిన డిమాండ్‌ను విస్మరించడం న్యాయసమ్మతం కాదని పేర్కొన్నారు.

మోడల్ ప్రైమరీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో ఉన్న ప్రాథమిక విభాగాల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని చూపించి కొన్ని పాఠశాలలను ఫౌండేషన్ స్కూల్‌లుగా మార్చడం ద్వారా ప్రాథమిక విద్యాభివృద్ధికి చెక్ వేసినట్టేనని ఆప్టా అభిప్రాయపడింది.

అంతేకాదు, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తిని 45కు బదులుగా 54గా నిర్ణయించడం వల్ల అనేక స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్‌గా మారినట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులపై ప్రభావం పడే విధంగా ఉపాధ్యాయుల కొరత తలెత్తుతోందని ఆప్టా స్పష్టం చేసింది.

మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఫౌండేషన్ స్కూల్‌లలో 1:20 ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని అమలు చేయాలి, ప్రాథమిక పాఠశాలల్లో ప్రమోషన్‌కు అర్హులైన టీచర్లను ప్రధానోపాధ్యాయులుగా నియమించాలి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్తి స్థాయి స్కూల్ అసిస్టెంట్లను నియమించాలి, ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులకు ఒక సెక్షన్‌గా గుర్తించాలన్న డిమాండ్లను నెరవేర్చాలని కోరింది.

పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చి విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాశ్ రావు స్పష్టం చేశారు.

 

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని