సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు
పురపాలక పాఠశాలలకు 2020 పోస్టులు మంజూరుపై హర్షం
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలలకు 2020 కొత్త పోస్టులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కృతజ్ఞతలు తెలిపింది. గత 17 ఏళ్లుగా పురపాలక, కార్పొరేషన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హెచ్ఎంలు, సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు లేక విద్యా ప్రమాణాలు దిగజారాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు వెల్లడించారు.
వీరి ప్రకటన ప్రకారం, నేడు నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో పురపాలక పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో మున్సిపల్ పరిధిలో 63, కార్పొరేషన్ పరిధిలో 41 గ్రేడ్-2 హెచ్ఎంలు, 2016 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు (అన్ని సబ్జెక్టుల కలిపి), అదనంగా 2 ఎస్జీటీ పోస్టులు మంజూరయ్యాయి.
పురపాలక విద్యాభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంటూ, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.