పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు.

ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించిన మేరకు పురపాలక ప్రాంతాల్లో 63 హెచ్‌ఎంలు, కార్పొరేషన్ పరిధిలో 41 హెచ్‌ఎంల పోస్టులు మంజూరయ్యాయి. అదే విధంగా అన్ని సబ్జెక్టుల వారీగా 2016 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా, అదనంగా ఇద్దరు ఎస్‌జీటీ పోస్టులు కూడా మంజూరయ్యాయని రామకృష్ణ వివరించారు.

ఇన్నాళ్లుగా పదోన్నతులకోసం ఎదురు చూస్తున్న పురపాలక టీచర్లకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని, పాఠశాలల అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని