ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి


-  అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్యులు

గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): ఆర్యవైశ్యులు సామాజిక సేవకులని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. సేవా రంగంలో సర్వులకూ ఆదర్శపాత్రులని తెలిపారు. ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఒక హోటల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, "రాజకీయాల్లోకి వచ్చేనాటికి నా దగ్గర ధన బలం లేదు.. కుల బలం లేదు.. కనీసం రాజకీయ వారసత్వం కూడా లేదు.. అయినా అప్పిరెడ్డి మా వాడని గుండెలకు హత్తుకున్న గుంటూరు ప్రజల ప్రేమానురాగాలే ఊపిరిగా పెరిగాను! ఆర్యవైశ్యుల ఆదరాభిమానాలే ఆలంబనగా ఎదిగాను!! అందుకే నన్ను తమ సొంత కుటుంబ సభ్యుడిలా భావించిన ఆర్యవైశ్యులు ఎప్పుడో ఇచ్చిన అప్పిరెడ్డి గుప్తా అనే బిరుదును  ఎప్పుడూ తానొక డాక్టరేట్‌లా భావిస్తాను" అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ప్రకటించారు.

ఆర్యవైశ్యులు తమ దైనందిన కార్యకలాపాలతో పాటు దాతృత్వ కార్యక్రమాలలో సైతం ఎప్పుడూ మిగిలిన వారి కంటే ఒకడుగు ముందే ఉంటారని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. ఓ పక్క వర్తక, వాణిజ్య రంగాలలో తలమునకలై ఉంటూనే మరో పక్క సొంత లాభం కొంత మానుకుని పొరుగువారి శ్రేయస్సు కోసం పాటుపడతారని కొనియాడారు. సమాజానికి అవసరమైన అన్ని సమయాలలో మేమున్నామని ముందుకొచ్చే ఆర్యవైశ్యుల పట్ల తనకు ప్రత్యేకమైన అభిమానమని ఆయన తెలిపారు.

ఆర్యవైశ్యులతో ఉన్న అనుబంధం కారణంగానే తాను కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు.  వారు తన పట్ల చూపుతున్న ఎనలేని ఆదరాభిమానాలు మరువలేనివని స్పష్టం చేశారు. సేవ, సాయం అంటే ముందుగా గుర్తొచ్చే ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి  ప్రకటించారు. 

ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ, మొదటి నుంచి ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అండగా నిలిచిన వ్యక్తిత్వం అప్పిరెడ్డి సొంతమని వ్యాఖ్యానించారు. వ్యాపార పరంగా ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు సైతం ఆసరాగా నిలవాలని ఆయన కోరారు. దేవరశెట్టి చిన్ని మాట్లాడుతూ, వ్యాపార వర్గాల సమస్యల పరిష్కారంలో.. ఒడిదుడుకులను అధిగమించే విషయంలో ఎప్పుడూ తోడుగా నిలవడమే అప్పిరెడ్డి నైజమని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మొగిలి సతీష్, రత్న ప్రసాద్, టీఎల్వీ వీరాంజనేయులు, కొత్త వెంకటేశ్వరరావు, అచ్యుత నాగేంద్రన్, ఆకుల వసుంధర, నూనె కిషోర్, మేడా సాంబశివరావు, బందా రవీంద్రనాథ్, ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), బత్తుల దేవానంద్, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News

మొంథా తుపాను ముప్పు...  మొంథా తుపాను ముప్పు... 
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది — రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశంకాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తీరం దాటే సూచనలు అమరావతి  ( జర్నలిస్ట్...
 ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి
కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి