గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం
- ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యాన్ని చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగుల డిఏ విధానం గాడి తప్పిందన్నారు. ఆరు నెలలకు ఒకసారి కేంద్రప్రభుత్వం తమ ఉద్యోగులకు ఇచ్చే డిఏ ల ప్రకారం దామాషా పద్దతిలో రాష్ట్రంలో ఉద్యోగుల కు చెల్లించటం రాష్ట్రప్రభుత్వ కనీసబాధ్యత అని సురేష్ బాబు స్పష్టం చేశారు. వాస్తవంగా,న్యాయంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలను పిఆర్సీతో కలిపి చెల్లించి అసలు వేతనాలు పెంచకుండా రివర్స్ పిఆర్సీ తో గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తి,అసహనానికి గురి చేసిందని గుర్తు చేశారు.ఉద్యోగ సంఘాలతో గౌరవప్రదంగా చర్చలు జరిపి అనంతరం వెంటనే ప్రభుత్వం డిఏ చెల్లింపు ప్రకటన చేయటం ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం కలిగిందన్నారు.పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లలో మరో రెండు డిఏ లు సంక్రాంతి నాటికి చెల్లించి,పెండింగ్ లో ఉన్న మిగతా అంశాలపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని సురేష్ బాబు కోరారు.