పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
On
పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం దురదృష్టకరమని, వారి మృతిపై మంత్రి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రస్తుతం గాయపడ్డవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. బాధితులకు అవసరమైన చికిత్స పూర్తిగా ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి బాధితులకు అండగా ఉండాలని సూచించారు.ప్రమాదంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ మద్దతుగా అన్ని విధాలా సహాయం అందించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.
About The Author
Latest News
16 May 2025 19:32:02
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు (...