దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేసిన నాయకులు
దుగ్గిరాల మండలంకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నూతక్కి విజయరావుకు రూ. 1,84,189 /- పెనుమూలి గ్రామానికి చెందిన షేక్ నాగుల్లాకు రూ. 65,270 /- చింతలపూడి గ్రామానికి చెందిన నల్లనుకల వెంకట రామయ్యకు రూ. 1,88,005 /- శృంగారపురం గ్రామానికి చెందిన శృంగారపాటి మరియమ్మకు రూ. 62,466 /- ఈమని గ్రామానికి చెందిన బెల్లంకొండ శ్రీనివాసరావుకు రూ. 54,900/- చిలువూరు గ్రామానికి చెందిన మెడబలిమి నరేంద్ర బాబుకు రూ. 59,909/- విలువైన చెక్కులు అందజేశారు. ఆర్థిక సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి కొండంత అండనిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తాడిబోయిన రామకృష్ణ, కొండూరు సుధారాణి, ఎంపీటీసీ కొప్పుల మధుబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఇంటూరి శ్రీనివాసరావు, పట్టేలా శ్రీనివాసరావు, యలవర్తి అంకమయ్య, మద్దుకూరి శ్రీనివాసరావు, కాబోతు దేవదాసు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు కోళ్ళ వెంకట రమణ, మండల తెలుగురైతు అధ్యక్షులు నందిపాటి జోగారావు నాయకులు అంచె మారుతీ, కాసరనేని కృష్ణ, అంచె రవిచంద్, కేసంనేని వాసుబాబు, ఆకుతోట శంకర్, చెకూరి పాములు, అబ్ధుల్ రషీద్, నాయుడు సీతయ్య, మొగల్ మస్తాన్, కళ్యాణ చక్రవర్తి, కొరిటాల భాస్కర్, నజీర్, అబ్ధుల్ హమీద్, బాజీ, ఎన్ఆర్టి జానీ, కల్ బాబు, ఖాశిం, మౌలాలి, ఇమాంమ్ వలి, బాజీ, బుజ్జి, గుడూరు మనోజ్, కనపాల దేవరాజు, ఉన్నాం బాలశౌరి, శృంగారపాటి బాబు, ఉన్నాం సునీత, కటారి చంటి, కొమ్మూరి బుల్లెబ్బాయి, నరిశెట్టి గోవర్ధన్, గండికోట ఆదినారాయణ, గోళ్ళ శ్రీనివాసరావు, గండికోట గంగయ్య , పులివర్తి కార్తీక్, గోళ్ళ నాగరాజు, ముద్రబోయిన రామయ్య, గోళ్ళ బాలాజీ, యాతం గోపయ్య, నల్లమేకల నరేంద్ర, సూరగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు