విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ
తెనాలి : విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తెనాలి పట్టణంలోని వివిధ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యల- మలాథియాన్ మందుతో పిచికారీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక మలేరియా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఇన్‌చార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి తెలిపారు.
దోమల ద్వారా వ్యాపించే రోగాలు వసతి గృహాల్లోని విద్యార్థులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మలేరియా సబ్‌యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి సంయుక్తంగా పాల్గొన్నారు. హాస్టల్ వార్డెన్లు పి. చింతయ్య, సుజాత, ప్రిన్సిపల్ డాక్టర్ బండి విజయ కుమార్, రజని, అశోక్ కుమార్, ప్రమోదిని, నిరీక్షణరావు, మరియదాసు తదితరుల సహకారాన్ని అభినందించారు.
కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ నవీద్, షేక్ రషీద్, వేణుగోపాల్, కరిముల్లా, వార్డు హెల్త్ సెక్రటరీలు జవ్వాజీ లక్ష్మీ తులసి, ఆశా కార్యకర్త జి. వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.