ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం

ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం

దుగ్గిరాల (జర్నలిస్ట్ ఫైల్): జూన్ 5న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరగనున్న ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని దుగ్గిరాల యూనిట్ నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఆ సమావేశానికి ప్రతినిధులుగా అందరూ హాజరుకావాలని వారు కోరారు.

ఈ మేరకు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో యూనిట్ అధ్యక్షుడు అందెబాల చంద్రమౌళి, సహాధ్యక్షుడు వంకదార సుబ్బారావు, ఉపాధ్యక్షుడు గుంటూరు పూర్ణ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ బొల్లంపల్లి బుజ్జి, కార్యవర్గ సభ్యులు వంగల పున్నారెడ్డి, జి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ భాషా మౌఖిక ఆదేశాల మేరకు మండలంలోని పంచాయతీ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బందిని కలిసి సమావేశానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, "ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించి, మంచి పీఆర్సీ సాధించేందుకు కృషి చేస్తాం. సీఎం ఉద్యోగుల పక్షపాతిగా నిలిచి, వారి భవిష్యత్తుకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారని నమ్మకముంది" అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పరిపాలనాధికారి వడ్లమూడి చంద్రమోహన్, ఇఓపిఆర్డి కావూరి జవహర్ లాల్ నెహ్రూ, సీనియర్ అసిస్టెంట్ సాంబశివరావు, టైపిస్టు నజీర్, అనురాధ, పంచాయతీ కార్యదర్శులు రామ్ కుమార్, రవి, వెంకట్రావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

About The Author

Latest News

యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు మంగళవారం విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా...
మెకానికల్ లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
స్వర్ణాంధ్ర సాధన లో నూతన జాతీయ విద్యా విధానం ప్రముఖ పాత్ర
ఘనంగా టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు
ఎస్ఆర్ఎం వర్సిటీకి క్యూ ఎస్ఐ - గేజ్ హ్యాపీనెస్ అవార్డు.
 మంగళగిరి డాన్ బోస్కో స్కూల్ పుస్తకావిష్కరణ
డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ