ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి
సామాజిక సేవాసంస్ధ గణేష్ యూత్ కన్వినర్ వీరవల్లి మురళి
తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడే ప్రయత్నాలు చేసుకోవాలని సామాజిక సేవాసంస్ధ
గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి నిరుద్యోగ యువత నుద్దేశించి అన్నారు. మండలంలోని అంగళకుదురులో గురువారం గణేష్ యూత్ కన్వినర్ వీరవల్లి మురళి మీడియాతో మాట్లాడుతు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనా అంశాలపై, తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, ఇదే అదనుగా చేసుకుని కొందరుకేటుగాళ్లు
మాయమాటలతో, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ, నిరుద్యోగ యువతను నమ్మబలికించి వారి నుండి లక్షల్లో కాజేస్తున్న ఉదంతాలను తరచు చూస్తున్నామని అన్నారు. పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకూడా ఇటువంటి ఉదంతం వెలుగు చూసిందని, అన్నారు.నిరుద్యోగ యువత తస్మాత్ జాగ్రత్త, మాయమాటలు నమ్మి, ఉద్యోగం వస్తుందనే భ్రమలో భారీగా నగదు వారి చేతుల్లో పెట్టి,మోసపోవద్దనిహితవుపలికారు.
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో, నేరుగా ఆయా శాఖల నుండి సమాచారం వస్తుందని, అందుకు అనుగుణంగానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, మధ్యవర్తులను నమ్మడం వల్ల ఇబ్బందులే ఉంటాయన్నారు.గుంటూరు కేంద్రంగా ఇటువంటి మోసాలకు పాల్పడేవారి బారినపడి, ఉద్యోగాలు రాక,ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో నలిగిపోతున్న కుటుంబాల వ్యధను,తెనాలి రూరల్ ప్రాంతంలొ గమనించామని అన్నారు. న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, ఉద్యోగాల పేరుతో మోసాలు చేసే వారిపై నిఘా పెట్టి, వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని తమభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో ఎంతో కాలంగా అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, సరికొత్తగా తీర్చిదిద్దడంతొ వాహనదారులకు ఊరట లభించిందని,. ప్రధానంగా అంగలకుదురు నుండి గరువుపాలెం వరకు రోడ్డు అభివృద్ధి చేసిన తీరు పట్ల గణేష్ యూత్ సభ్యులు హర్షం వెలిబుచ్చారు. ఈ సమావేశంలో అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, ఎం సాంబ శివరావు, గొల్లపూడి సాయిగిరి, ముక్కామల సుబ్బయ్య, చెరుకూరు శ్రీను, పాలడుగు నాగయ్య, పేరం నవీన్ తదితరులు పాల్గొన్నారు.