ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల చైర్మన్ వెంకట్రామిరెడ్డి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.
"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి 16 నెలలు సమయం పట్టింది. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి" అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
పెన్షనర్ల కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఆ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు. ఉద్యోగ.ఉపాధ్య వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని... ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్క డిఎతో మమ అనిపించారు కూటమీ పాలనలో ఉద్యోగం ఉన్నవాడు.. ఉద్యోగం లేని వాడు సంతోషంగా లేడు. 2.70 లక్షల వాలంటీర్లను పది వేలు ఇస్తానని మోసం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. బేవరేజెస్లో 18 వేల ఉద్యోగులను తొలగించారు. ఫైబర్ నెట్ లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎండియూ వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు.
ఆబ్కాసన్ను రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు.. చివరకు సచివాల ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు గతంలో బకాయిలు పెట్టిన రెండు డిఎలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించారు. ఆఖ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. వైఎస్ జగన్ వ్యవస్థలను విస్తృత పరిచారు. ఉద్యోగులకు బకాయిలను మనస్పూర్తిగా చెల్లించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు.' అని వెంకట్రామిరెడ్డి తెలిపారు.